– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఢిల్లీలో లివ్ఇన్ రిలేషన్లో ఉంటూనే.. పెళ్లి చేసుకోవాలని నిలదీసిన శ్రద్ధా వాకర్ని ఆఫ్తాబ్ దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్‌బాడీని 35 ముక్కలుగా నరికేసి.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. ఎవ్వరికీ తెలియకుండా వాటిని పారేస్తూ వచ్చాడు. ఆ మర్డర్ కేసు ఇన్విస్టిగేషన్ చేస్తుంటే ఢిల్లీ పోలీసులకు మరో దారుణమైన మర్డర్ కేసు బయటపడింది. శ్రద్ధా డెడ్‌బాడీ కోసం వెతుకుతుండగా ఇంకొన్ని మానవ శరీర అవయవాలు పోలీసులకు లభించాయి. వాటిని పరిశీలించగా ఇట్లాంటి మర్డర్ కేసు లింక్ దొరికింది.
లిఫ్ట్ మ్యాన్‌గా పనిచేస్తున్న అంజన్ దాస్‌ని అతని భార్య, కొడుకు కలిసి దారుణంగా నరికి చంపేశారు. మే నెలలో మర్డర్ చేసిన తర్వాత అంజన్‌దాస్ భార్య పూనమ్, ఆమె కుమారుడు దీపక్ మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. ఆ శరీర భాగాలను ఎవరూ చూడకుండా తూర్పు ఢిల్లీ పరిసరాల్లో పారవేస్తూ వచ్చారు. శ్రద్ధా కేసు దర్యాప్తు చేస్తుంటే వేరే డెడ్‌బాడీ అవయవాలు లభించడంతో పోలీసులు ఈ కేసుని టేకప్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రైమ్స్ డీసీపీ అమిత్ గోయల్ వెల్లడించారు..
మర్డర్ కేసులో కీలకమైన అంశాలు ఏంటంటే..
• ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలోని పాండవ్ నగర్‌లో నివసిస్తున్న అంజన్ దాస్ లిఫ్ట్ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అతడిని హత్య చేసి అనేక ముక్కలుగా నరికేశారు. అతని భార్య, కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. శరీర భాగాలను పారవేసే ముందు ఆ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచారు.
• నిందితురాలు పూనమ్, ఆమె కుమారుడు దీపక్ చేత దాస్ మే నెలలో హత్యకు గురయ్యాడు. జూన్‌లో పాండవ్ నగర్‌లో పోలీసులు మొదట శరీర భాగాలను కనుగొని హత్య కేసు నమోదు చేశారు. అయితే మృతదేహం ముక్కలు కుళ్లిపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ నెల ప్రారంభంలో శ్రద్ధా వాకర్ హత్య కేసు బయటికి రావడం.. ఆ వివరాలు తెరపైకి రావడం ప్రారంభించినప్పుడు, గుర్తు తెలియని శరీర భాగాలు ఆమెవేనా అని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
• పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్, ఆమె కుమారుడు దీపక్ అక్రమ సంబంధం కారణంగా అంజన్ దాస్‌ను హత్య చేశారు. బాధితుడికి మొదట నిద్రమాత్రలు వేసి హత్య చేశారని వారు తెలిపారు. మహిళ, ఆమె కుమారుడు అతని శరీరాన్ని నరికి ఫ్రిజ్‌లో భద్రపరిచారు. పాండవ్ నగర్, సమీప ప్రాంతాలలో వాటిని చెల్లాచెదురుగా పడేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ఆరు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయితే డెడ్‌బాడీ మొండెం ఇంకా కనిపించలేదు.
• ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రైమ్స్ డీసీపీ అమిత్ గోయెల్ మాట్లాడుతూ.. ” 2016లో పూనమ్ తన భర్త కల్లు చనిపోయిన తర్వాత అంజన్ దాస్‌ను 2017లో రెండో వివాహం చేసుకుంది. కల్లు దీపక్ తండ్రి. మరణించిన అంజన్‌కు బీహార్‌లో కూడా వివాహం అయ్యింది. ఎనిమిది మంది పిల్లలున్నారు. అతను సంపాదించడం లేదు, వీరిపై ఆధారపడి బతుకుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లీ కొడుకులు అంజన్‌కు మద్యం తాగించి, అందులో నిద్రమాత్రలు కలిపారు. ఆపై వారు అతని గొంతు కోసి, రక్తం పూర్తిగా పోయేందుకు మృతదేహాన్ని ఇంట్లో ఉంచి, ఆపై మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికారు.
• దీనికి కత్తి, మరో పదునైన ఆయుధాన్ని ఉపయోగించారు. పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కనుగొనడానికి గాలిస్తున్నారు. వాసన రాకుండా ఉండేందుకు శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపరిచిన తర్వాత ఇంటికి రంగులు కూడా వేశారు.
• పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించారు. దీపక్ రాత్రిపూట చేతిలో బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్లి డెడ్‌బాడీ ముక్కలను పారేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.