Monday, November 18, 2024

Big Breaking: తెలంగాణ‌లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌.. నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. గిరిజ‌న బిడ్డ‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ ఇవ్వాల రాత్రి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. శ‌నివారం నుంచి రిజ‌ర్వేష‌న్ల పెంపు అమ‌ల్లోకి వ‌స్తుంది. ఈ నెల 17న జ‌రిగిన ఆదివాసీ, గిరిజ‌నుల ఆత్మీయ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌డంతో సీఎం కేసీఆర్ మాట క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు నిరూపించుకున్నారు.

దీంతో రాష్ట్రంలో గిరిజ‌నుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు అమ‌ల‌వుతున్న ఆరు శాతం రిజ‌ర్వేష‌న్ల విధానాన్నే తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేస్తూ వ‌చ్చింది. రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారి రిజ‌ర్వేష‌న్ 10 శాతానికి పెంచాల‌ని ఇంత‌కుముందే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి.. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపింది.

ఏడేండ్లు దాటినా గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుప‌లేదు. ఈ బిల్లుపై కేంద్రం త‌న వైఖ‌రిని నానుస్తూ వ‌చ్చింది. దీంతో ఈ నెల 17న జ‌రిగిన ఆత్మీయ స‌భ‌లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం కేసీఆర్ గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement