పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా కల్తార్‌సింగ్ సంధ్‌వాన్‌ను నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయం తీసుకుంది. డాక్టర్ దల్జీత్ కౌర్, హర్పాల్ సింగ్ చీమా, హర్బజన్ సింగ్, లాల్ చంద్, డాక్టర్ విజయ్ సింగ్లా, గుర్మిత్ సింగ్, లాల్ జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్ జింపా, కటారుచక్,హరజోత్ సింగ్ బెయిన్స్, కుల్దీప్ సింగ్ ధలివాల్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది.