భారీ భూకంపాల వల్ల అనటోలియా భూభాగం 10మీటర్లు కిందకి ఒరిగిన్లు ఇటలీ శాస్త్రవేత అంచనా వేశారు.మధ్యదరా సముద్రం, నల్ల సముద్రం, ఏజియన్ సీ మధ్య ఉన్న భూభాగాన్ని అనటోలియా భూభాగంగా గుర్తిస్తారు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ శాస్త్రవేత్త అలెసాండ్రో అమటో దీనిపై ఓ రిపోర్టు రిలీజ్ చేశారు. సిరియాతో ఉన్న సరిహద్దు వద్ద .. 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల తుర్కియేతో పాటు సిరియాలోనూ పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.
సిరియా, తుర్కియే బోర్డర్ వద్ద ఉన్న ఫాల్ట్ లైన్ ఇప్పుడు భూకంప జోన్‌గా మారిందన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 10 మీటర్ల మేర భూమి జరిగినట్లు సెసిమాలజిస్ట్ అమటో అంచనా వేశారు. ట్రాన్స్‌కరెంట్ మూమెంట్ వల్ల భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అనటోలియా ఫాల్ట్ జోన్ సరిహద్దుల్లో భూమి రెండు వైపులా సుమారు 10 మీటర్ల మేర కిందకు జారిందన్నారు.
సిరియా..తుర్కియే బోర్డర్ వద్ద.. 10మీటర్లు కుంగిన భూమి
Advertisement
తాజా వార్తలు
Advertisement