Friday, November 22, 2024

Shame: యువతిపై గ్యాంగ్​రేప్​.. బైక్​పై వెళ్తుంటే అడ్డగించి 10 మంది అఘాయిత్యం!

జార్ఖండ్​ రాష్ట్ర రాజధాని రాంచీకి 180 కిలోమీటర్ల దూరంలోని చైబాసాలో 26ఏళ్ల సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​పై గ్యాంగ్​రేప్​ జరిగింది. నిన్న సాయంత్రం తన లవర్​తో కలిసి బైక్​పై వెళ్తున్న సమయంలో చైబాసాలోని ఓల్డ్​ ఏరోడ్రోమ్​ దగ్గర దాదాపు 10 మంది వ్యక్తులు బైక్​ ఆపి దాడికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని, ఆమె లవర్​ని చితకబాది కట్టిపడేశారు. అతని కండ్లముందే ఆ యువతిని గ్యాంగ్​ రేప్​ చేసి అక్కడే వదిలేసి వెళ్లారు. ఆమె వాలెట్‌, మొబైల్‌ ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లారు.

ఆ యువతి ఎలాగోలా ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గనాథ్​పూర్​లోని సదర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువతని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్​ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పశ్చిమ సింగ్​భూమ్​ ఎస్పీ అశుతోష్​ శేఖర్​ తెలిపారు. కాగా,  చైబాసా సదర్‌కు చెందిన సబ్-డివిజనల్ పోలీసు అధికారులు (SDPOలు), ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌చార్జి అధికారి SITలో సభ్యులుగా ఉన్నారు. 

టౌన్‌షిప్ వెలుపల ఏకాంత ప్రదేశంలో ఈ ఘటన జరిగిందని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా ఆ యువతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు ఆయన తెలిపారు.  ఈ గ్యాంగ్​ రేప్​ ఘటనకు సంబంధించి 12 మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (సదర్) దిలీప్ ఖల్కో తెలిపారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

- Advertisement -

మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనల పట్ల సోరెన్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని బీజేపీ మాజీ సీఎం రఘుబర్ దాస్ విమర్శలు చేశారు.. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నందున రాష్ట్ర ప్రజలలో అభద్రతా భావం నెలకొందని ఆయన పేర్కొన్నారు. చైబాసాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను విడిచిపెట్టబోమని అధికార JMM పార్టీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement