Friday, November 22, 2024

ముంబ‌యి ఎయిర్ పోర్టులో.. రూ.10.16 కోట్ల బంగారం సీజ్

ఎయిర్ పోర్ట్ లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారాన్ని డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప‌ట్టుకున్నారు.పేస్ట్, చిన్న చిన్న ముక్కలు, ఆభరణాల రూపంలో 16.36 కిలోల బంగారాన్ని వారు దేశంలోకి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. యూఏఈ నుంచి వారు ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 10.16 కోట్లు అని అధికారులు అంచనా వేశారు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర ముంబ‌యి ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. యూఏఈ నుంచి సిండికేట్ అయిన కొందరు భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. మొత్తం మూడు విమానాల్లో వారు ప్రయాణిస్తున్నారని తెలుసుకున్నారు.

దీంతో డీఆర్ఐ అధికారులు విమానాల నుంచి బయటకు వస్తున్నవారిపై నిఘా వేశారు. అనుమానిత ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ చేసి రూ. 10.16 కోట్ల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.ఈ కేసులో మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకు న్నారు. 18 మంది సూడాన్ మహిళలు ఉన్నారు. ఒక ఇండియన్ ఉన్నారు. ఇండియన్ వారందరినీ కోఆర్డినేట్ చేశారని అధికారులు తెలిపారు.అధికమొత్తంలో బంగారం వారి బాడీలో దొరికింది. ఆ బంగారాన్ని గుర్తించడం కష్టంగా మారింది. వారికి సంబంధించిన ప్రాంతాల్లో సెర్చ్ చేయగా రూ. 85 లక్షల 1.42 కిలోల బంగారం, 16 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 88 లక్షల భారత కరెన్సీని రికవరీ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement