దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,84,372 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 82,339 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక 24 గంటల్లో కరోనా వైరస్ ప్రభావం 1,027 మంది ప్రాణాుల కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 13,65,704 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,38,73,825 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,23,36,036 మంది కరోనాను కోలుకున్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,72,085 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల 11లక్షల 79వేల 578 డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.