భాగ్యనగరంలోని రోడ్లపై తిరిగి డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోలిస్తే టెక్నికల్‌గా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్, నగరంలోని రోడ్లకు అనువైన బాడీ ఉండాలని ఆర్టీసీ సంస్థ తన టెండర్లలో పేర్కొనగా.. అశోక్ లేలాండ్ సంస్థ ముందుకొచ్చింది. తొలి దశలో 25 బస్సులను సమకూరుస్తామని ఆర్టీసీకి మాట ఇచ్చి టెండర్ దాఖలు చేసింది. మరో రెండు రోజుల్లో ఆర్టీసీ కమిటీ సమావేశమై బస్సుల ధరపై చర్చించి టెండర్‌కు ఆమోద ముద్ర వేయనుంది. దీంతో త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ బస్సులు BS6 ప్రమాణాల మేరకు తయారయ్యే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement