తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళనని…మత రాజకీయాలు తనతో చేయొద్దని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజలను విభజించడం అంత సులభం కాదని… లెక్కల ఆధారంగా, మతం ఆధారంగా ప్రజలను వేరుచేసి తాము చూడమని…మాకు అందరూ సమానమే అని దీదీ స్పష్టం చేశారు. 30 శాతం ప్రజలు వారివైపు ఉంటే.. మిగతా 70 శాతం మంది మావైపు ఉన్నారు అని బీజేపీ నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది మమతా. సువేందు అధికారి తనను తాను నందిగ్రామ్ భూమిపుత్రుడిగా అభివర్ణించుకుంటూ.. మమతను బయటి వ్యక్తిగా పేర్కొనడంపై నిప్పులు చెరిగారు..
ఇక ప్రచారంలో దూసుకుపోతోంది దీదీ. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌కి వెళ్లి టీ కాచి అందరికీ అందించారు. ఆ తర్వాత అందరితో కలిసి తాను కూడా టీ తాగారు. మమత టీ కాచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది. మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు. మమత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో 33 రోజులపాటు ఎన్నికలు జరగనున్నాయి.