Tuesday, November 26, 2024

స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా.. కరణం మల్లీశ్వరి నియామకం..

ఒలింపిక్‌ పతక విజేతగా, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు బిడ్డ కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. మల్లీశ్వరిని ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం తొలి వైఎస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.


ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చెబుతూ, క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. వారు ఇతరత్రా మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీ స్థాయి నుంచి పీహెచ్ డీ వరకు వివిధ క్రీడాంశాల్లో వర్సిటీ కోర్సులను అందిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement