Tuesday, November 26, 2024

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వస్తుందా?

కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా పలు చోట్ల అధికారులు, కరోనా వారియర్లు కరోనా వైరస్ బారిన పడుతుండటం మన చూస్తూనే ఉన్నాం. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు భారత్‌లో ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. తద్వారా టీకా ఆవశ్యకత, సామర్థ్యంపై పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

టీకా పొందిన తర్వాత కూడా కరోనా వైరస్ బారిన పడటం సర్వసాధారణమే అని పలువురు సైంటిస్టులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14 రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కూడా కేవలం 50 శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుంది. రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ అనేది పూర్తిగా వైరస్ శరీరాన్ని ప్రభావితం చేయకుండా బలహీనం మాత్రమే చేస్తుందని.. వైరస్ పూర్తిగా రాకుండా కాదని వారు చెప్తున్నారు.

ఇప్పటివరకు ఆమోదించబడిన అన్నివ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే వ్యాక్సిన్లు కావన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మనిషికి వైరస్ సోకినా అంత హానికరం కాదని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ తీవ్రత, మరణించే అవకాశాలను తగ్గిస్తుందే కానీ సంక్రమించే ప్రక్రియను ఆపలేదన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి టీకాలు వేయడం అవసరమే అని చెన్నైకి చెందిన జీవ శాస్త్రవేత్త డా.శంకరన్ కృష్ణస్వామి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే వ్యాక్సిన్లు అనేవి వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఉద్దేశించినవే కానీ కొన్నిసార్లు రోగనిరోధక శక్తిని పెంచడానికే వాడతామని గుర్తుచేశారు. పోలియో వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్ వంటి ఇతర వ్యాక్సిన్లు కూడా రోగనిరోధక శక్తిని సృష్టించడానికి, వ్యాధి బారిన పడకుండా ఉండటానికి వేస్తామని.. కానీ అవి తీసుకున్న చిన్నారుల్లో కొందరు అంటువ్యాధుల బారిన పడుతారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement