ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసార్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు భూమిపై ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి ఉనికి నిరూపించే ఎన్నో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా పరిశోధనలు చేసి రాకాసి బల్లుల ఉనికి నిజమే అని చెప్పారు. అయితే కాలక్రమంలో భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, తుఫాన్‌లు, భూకంపాల కారణంగా ఈ రాకాసి బల్లులు చాలా వరకు అంతరించిపోయాయి.
అయితే ప్రస్తుతం రాకాసి బల్లి జాతికి చెందిన కొమాడో డ్రాగన్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. కొమాడో డ్రాగన్ వేటాడటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఇందులో ఓ కోతి కొమాడో డ్రాగన్‌తో పోట్లాటకు దిగింది. ఈ భయంకర పోరాటంలో చివరికి ఆ రాకాసి బల్లి.. కోతిని మింగేసింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఈ వీడియోను ఓ లుక్కేయండి.