టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరన వైట్ చాలెంజ్ తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజేసింది. డ్రగ్స్ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. రేవంత్ ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు విసిరారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణ నెలకొంది. రేవంత్ ఇంటిని ముట్టించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా.. కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధంయ ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.
మరోవైపు రేవంత్, కేటీఆర్ మధ్య మొదలైన డ్రగ్స్ రగడ కొనసాగుతోంది. కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాలు విసిరిన రేవంత్‌రెడ్డి… తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ గన్‌పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో అమరుల స్ధూపాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేశారు. రేవంత్ ధర్నాతో గన్ పార్క్ అపవిత్రమైందని నిరసన వ్యక్తం చేశారు. అమరవీరుల స్ధూపాన్ని పాలతో కడిగారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.