Friday, November 22, 2024

నిజాలు బయటపెట్టిన మెఘన్‌ మోర్కెల్‌

బ్రిటిష్ రాజకుటుంబంలో వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రిన్స్ హ్యారీకి, మేగన్ మోర్కెల్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి తమ కుటుంబంలోని అనేక వివాదాస్పద విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ హ్యారీ మాట్లాడుతూ.. తాను ఫోన్ చేస్తే తన తండ్రి కాల్ లిఫ్ట్ కూడా చేయడం లేదని, ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు చెందకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నానమ్మ,నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశారని ప్రిన్స్ హ్యారీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇన్ని సార్లు ఫోన్ చేసేకంటే మొత్తం ఓ లెటర్‌లో రాసి పంపించమన్నారని, ఆయన కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారని, అయనంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇప్పటికే తన మనసు చాలా గాయపడిందని ప్రిన్స్ హ్యారీ చెప్పాడు. 

ప్రిన్స్‌ హ్యారీని పెండ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి కొత్త సభ్యురాలిగా అడుగుపెట్టాక తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మానసిక సంఘర్షణకు లోనయ్యానని మేఘన్‌ మోర్కెల్‌ తెలిపారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా తనకు వచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబంలో వర్ణ వివక్ష పాతుకుపోయి ఉన్నదని ఆరోపించారు.

అమెరికా నటిగా జీవితాన్ని ఆరంభించిన నాకు రాచరికపు జీవితం గురించి ఎంత మాత్రం తెలీదని. మహారాణి ముందు ఎలా నడుచుకోవాలి? వంటివాటిపై అవగాహన లేదన్నారు. హ్యారీతో పెళ్లి అయిన తొలినాళ్లలో ఈ విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. కొత్త కోడలుగా వెళ్లిన నాపై ఆంక్షలు ఉండేవి. ఒక్కోసారిగా ఒంటరినయ్యా. మానసికంగా వేదనకు గురయ్యా. కొత్త వాతావరణానికి అలవాటుపడేందుకు నాకు కొంచం సమయం పడుతుందని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. నాపై నిందలు వేశారని వాపోయారు. ఇక తమకు పుట్టబోయే బిడ్డ రంగు గురించి చర్చ తనను తీవ్రంగా బాధించాయని ఆమే అన్నారు. నల్ల రంగులో పుడితే రాజకుమారుడి హోదా నా బిడ్డకు రాదని తన ముందే ఒకరు చెప్పారని వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement