Friday, November 22, 2024

మా ఇంటికి రావొద్దు మేడమ్.. వైఎస్ షర్మిలకు ఊహించని షాక్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతుంటే ప్రజల నుంచి కూడా ఊహించని షాక్‌లు ఎదురవుతున్నాయి. నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న యువత కుటుంబాలను పరామర్శిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి నరేష్ తండ్రి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. దీంతో దీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్‌టీపీ నాయకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన షర్మిలకు ఆ విధంగా విజ్ఞప్తి చేయడానికి కారణం ఏంటని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన నరేష్ విషయానికి డిగ్రీ చదివాడు. చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ నోటిఫికేషన్లు రాకపోవడం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ముగ్గురు అన్నలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, తాను మాత్రం నిరుద్యోగిగా ఉండిపోయానన్న ఆవేదనతో నరేష్ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పుడు షర్మిల తమ ఇంటి వద్ద దీక్ష చేపడితే తన ముగ్గురు కొడుకుల ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతో నరేష్ తండ్రి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండిః తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement