Friday, November 22, 2024

మధురం సీతాఫలం

సీతాఫలాల్లో ఔషధ గుణాలు
ఊపందుకున్న వ్యాపారం.. జోరుగా కొనుగోళ్లు
సీతాఫలాలతో ఉపాధి పొందుతున్న కూలీలు
సీతాఫలం.. ఎంతో మధురం. సీజనల్‌గా దొరికే ఈ
పండ్లను తెలంగాణ యాపిల్‌గా పిలుచుకుంటాం.
ఏటా వర్షాకాలం ముగింపు నుంచి శీతాకాలంలో డిసెంబర్‌ వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. సీతాఫలంలో పుష్కలమైన పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. గుట్టల ప్రాంతాల్లోని చెట్ల నుంచి రైతులు, కూలీలు సేకరించి పట్టణాలలో విక్రయిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూలీలు ఎక్కువగా విక్రయించి ఉపాధి పొందుతున్నారు.

  • మహబూబ్‌నగర్‌ (ప్రభన్యూస్‌):
  • ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం..
    సీతాఫలం ఇతర పండ్ల కంటే ఎక్కువ విటమిన్‌లు ఉంటాయని, ఏడాదికి అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ వరకు దొరికే ఈ సీతాఫలం పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుకుంటారు. చిన్నపిల్లలు సైతం వీటిని తినేందుకు ఆరాటపడుతారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.
    ఉపాధినిస్తున్న సీతాఫలాలు..
    మెదక్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీతాఫలాలు రైతులు కూలీలు చెట్ల నుండి తీసుకొచ్చి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. రూ.10 నుంచి రూ.100 వరకు వివిధ రకాల సీతాఫలాలు విక్రయిస్తున్నారు. బస్టాండ్‌లు, మార్కెట్‌లలో ప్రజలు ఎంతో ఇష్టంగా వీటిని కొనుగోలు చేస్తారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement