Tuesday, November 26, 2024

పీవీ కూతురికి ఎమ్మెల్సీ సీటు….ఓవైసీ వ్యూహాత్మక మౌనం

రాజకియాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు…అధికారం కోసం మిత్రులు శత్రువులు అవుతారు…అదే శత్రువు విుత్రుడు
అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటన మన తెలంగాణలో చోటుచెసుకుంది. మాజీ ప్రధాని వీపీ నరసింహరావు పేరు వింటేనే అంతెతున లేస్తారు ఎంఐఎం నాయకులు. మొన్నామధ్య టాంక్‌ బండ్‌ పై పీవీ, ఎన్టీఆర్‌ విగ్రహాలని తొలగించాలని సంచలన కామెంట్స్‌ చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ …అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా స్పందించగా… టీఆర్‌ఎస్‌ కూడా ఆవ్యాఖ్యలను ఖండించింది.


అంతేకాదు దేశంలోనే అతిపొడవైన ప్లైవోవర్‌ పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమయినపుడు కూడా ఎంఐఎం నాయకులు మాటల తూటాలు పేల్చారు. రహదారికి పీవీ పేరుపెట్టకూడదని నానా హంగామా చెశారు. అంతే కాదు వీలయినప్పుడల్లా పీవీ కి సంబంధించిన విషయాన్ని వివాదం చేస్తూ వచ్చారు. అసలు బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సమయంలో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహరావు….ఆఘటనను అడ్డుకోలేకపోయారనే భావనలో ఎంఐఎం పార్టీ ఉంది. పీవీ కఠినంగా వ్యవహరించి ఉంటే అప్పట్లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగేది కాదని ఎంఐఎం పార్టీ అభిప్రాయం. అందుకే పీవీ నరసింహరావు విషయంలో ఎంఐఎం ఎప్పుడు వ్యతిరేక వైఖరితోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

అయితే రాజకీయాల్లో మిత్రులు శత్రువులు శాశ్వతం కాదని మరోమారు రుజువయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు వాణీ దేవికి సీటు కేటాయించింది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌ కి సైలెంట్‌ మిత్రం పక్షం……అంతేకాదు ఎంఐఎం మద్దతు వల్లే జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌స్‌ పార్టీకి మేయర్‌ పదవి దక్కిందనేది అందరికి తెలిసిన విషయమే. అధికారికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కి ఇప్పుడు సపోర్ట్‌ చేయకపోయిన ఆరెండు పార్టీలు ఆపద సమయంలో చేయి చేయి కలుపుతాయనేది రాజకీయ నాయకుల విశ్లేషణ. పీవీని తెలంగాణ సింబల్‌గా చేసుకుని, తెలంగాణ సెంటిమెంట్‌ను పథాక స్థాయికి తీసుకువెళ్లాలనేది టీఆర్‌ఎస్‌ పార్టీ మాస్టర్‌ ప్లాన్‌. మరీ పీవీ కూతురుకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పట్ల ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. దీని ఉద్దేశ్యం ఎంటో అని రాజకీయ పండితులకు సైతం అంతుపట్టడం లేదు. మరీ అధికారం కోసం సొంత అజెండాను సైతం పక్కనపెట్టారా లేక ఇక నుంచి నిజంగానే టీఆర్‌ఎస్‌ పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement