Tuesday, November 26, 2024

ప్రాణవాయువు ఖాళీ అవుతోంది

ఈ భూమి మీద సమస్త జీవరాశికి ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే జీవరాశి మనుగడే ఉండదు. మరి భవిష్యత్‌లో ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకగలడా? ఈ ప్రశ్నకు అవుననే అంటోంది జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. ఈ సంస్థ చేసిన ఓ అధ్యయనంలో భవిష్యత్‌లో ఆక్సిజన్ దొరకదని.. అయితే దీనికి 100 కోట్ల ఏళ్ల సమయం పడుతుందని తెలిపింది. అటు రాబోయే 10 వేల ఏళ్లలో భూమిపై ఉన్న ఆక్సిజన్‌లో 10 లక్షలవ వంతు ఉండదని సర్వే పేర్కొంది.

సౌర వ్యవస్థ జీవిత చక్రం కొనసాగుతున్నంత కాలం సూర్యుడు మరింత వేడెక్కుతాడని, ఫలితంగా పర్యావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ విచ్ఛిన్నమై ఆ వాయువు స్థాయి తగ్గిపోతుందని తెలిపింది. దీంతో మొక్కలకు జీవనాధారమైన కార్బన్ డై ఆక్సైడ్ అందదని, కిరణ జన్య సంయోగ క్రియ జరగక ఆక్సిజన్ కూడా విడుదల కాదని వెల్లడించింది. ప్రస్తుతం ఆక్సిజన్ చాలా అవసరమే అయినా.. అది శాశ్వతం మాత్రం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. జీవానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను ఎలా విశదీకరిస్తామన్నది దీనిపైనే ఆధారపడుతుందన్నారు. ఆక్సిజన్ లేకుండానే చాలా గ్రహాల మీద ఏక కణ జీవులు బతుకుతున్నాయని వారు గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement