Monday, November 25, 2024

ఉద్యోగులకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీని కోసం ల‌క్ష‌కు పైగా ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్‌ను సిబ్బంది కోసం ప్రభుత్వం కొనుగోలు చేయ‌నుంది. తాజాగా ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ కొనుక్కోవాల‌ని ఆస‌క్తి చూపుతున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయూత‌ ఇవ్వనుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల‌కు దేశీయ‌, అంత‌ర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ‌ల నుంచి ఈ ఎల‌క్ట్రిక్ స్కూటీలు, బైక్‌లను కొనుగోలు చేసేందుకు అండ‌దండ‌లు క‌ల్పించ‌నుంది. భారీ స్థాయిలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు టూ వీల‌ర్స్ కొన‌డం వ‌ల్ల ఆయా కంపెనీల‌కు రూ.500-1000 కోట్ల ఆదాయం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు.

త‌క్కువ వ‌డ్డీరేటుపై ఉద్యోగులు ఎలక్ట్రిక్ టూ వీల‌ర్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా ప్ర‌భుత్వం టూ వీల‌ర్స్ సంస్థ‌లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన‌ర్జీ ఎఫిషియెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ స‌ర్కార్ జ‌త క‌ట్టింది. భారీగా ఈవీ టూ వీల‌ర్లను ప్ర‌భుత్వోద్యోగుల‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూట‌ర్ల త‌యారీ సంస్థ‌ల నుంచి బిడ్ల‌ను ఆహ్వానించనుంది. ఏప్రిల్ 10 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. కాగా భారీ సంఖ్య‌లో ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం టూ వీల‌ర్స్ కొనుగోలు చేయ‌డానికి ముందుకు రావ‌డం ప్ర‌పంచంలోనే ఇది తొలిసార‌ని భావిస్తున్నారు. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక నియ‌మించిన వాలంటీర్లు నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల మంది గ్రామ కార్య‌ద‌ర్శుల్లా ప‌ని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement