Friday, November 22, 2024

ప్రకంపనలు సృష్టిస్తున్న గోల్డ్ స్కాం కేసు

కేరళలో గోల్డ్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్‌ స్కాం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్‌ కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేసినట్లు కస్టమ్స్ డిపార్టుమెంట్ వెల్లడించింది‌. ఆమె ఇచ్చిన ఆధారాలతో కేరళ హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించనుంది. సీఎంతో పాటు ఆయన సన్నిహితులపైనా స్వప్న సురేష్ సంచలన ఆరోపణలు చేశారు‌. కస్టమ్స్ విచారణలో సీఎంతో పాటు స్పీకర్, ఇద్దరు మంత్రులకూ సంబంధం ఉన్నట్లు స్వప్న చెప్పింది. దీంతో ఆమె చెప్పిన వివరాలతో హైకోర్టుకు కస్టమ్స్ నివేదిక ఇవ్వగా తదుపరి ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. కాగా జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్‌ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్‌ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement