Friday, November 22, 2024

పార్లమెంట్ నుంచి ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇళ్లకు సొరంగాలు

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ నిర్మాణం పనులు చకాచకా సాగుతున్నాయి. 2023 నాటికి పార్లమెంట్ భవనం పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టిన టాటా సంస్థ అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో పనులను కొనసాగిస్తోంది. పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని ఇంటికి, ఉపరాష్ట్రపతి ఇంటికి, సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. అత్యవసర సమయంలో ఈ మార్గాల ద్వారా ప్రధాని, ఉపరాష్ట్రపతిని తరలించే విధంగా ఏర్పాటు ఉంటుందని అంటున్నారు. రూ.971 కోట్ల వ్యయంతో మొత్తంగా మూడు విభాగాలుగా పార్లమెంట్ భవనం నిర్మాణం సాగుతోంది. సెంట్రల్ విస్టాను నవంబర్ 2021 నాటికి, పార్లమెంట్ భవనాన్ని మార్చి 2022 నాటికి, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ను మార్చి 2024 నాటికి పూర్తి చేయనున్నారు. సెంట్రల్ విస్టా విభాగంలో ప్రధాని నూతన నివాసం, ప్రధాని కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ ఛాంబర్లు వంటి నిర్మాణాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement