Friday, November 22, 2024

దటీజ్‌ సింగరేణి పవర్‌!

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డు
దక్షిణాదిలో సింగరేణికి వరుసగా ఇది నాలుగోసారి
ప్లాంట్‌ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపిన సీఎండీ శ్రీధర్‌
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాలలోని జైపూర్‌ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపి కైంది. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డు లను ప్రకటించే ‘ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్సలెన్స్‌ ( ముంబాయి) సంస్థ ‘ 2021 సంవత్సరానికి ‘ ఎనెర్జీ ఎఫిషియెన్సీ ‘ అవార్డును శుక్రవారం ప్రకటించింది. తక్కువ బొగ్గుతో తగిన ఉష్టోగ్రతను సాధించడం, ప్లాంట్‌ అవసరాలకు విద్యుత్‌, ఆయిల్‌ వినియోగం లోనూ పొదపును పాటించడంతో ఈ అవార్డు దక్కిం ది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభమై ఐదేళ్లే అయినప్పటికి జాతీయ స్థాయిలో వరుసగా నాలుగు అవార్డులను దక్కించుకున్నది. గత ఏడాది ప్రభుత్వ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విభాగంలో అత్యు త్తమ పీఎల్‌ఎఫ్‌ సాధించిన ప్లాంట్లలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత దేశంలో 500 మెగావాట్లు, అంతకు మంచి ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న దాదాపు 100 ప్లాంట్ల విభాగంలో అత్యుత్తమ అవార్డును సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు ప్రకటించారు. 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ ఒక యూనిట్‌ విద్యుత్‌ను ఉత్పతి చేయడానికి 2,444 కిలో కాలరీల శక్తి ( బొగ్గు)ని వినియోగించుకోవడాన్ని ప్రామాణికంగా చూస్తారు. కాగా, 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు ప్లాంట్లలోని ఒకటో ప్లాంట్‌ ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువగా 2,425 కిలో కాలరీల శక్తి (బొగ్గు) ని మాత్ర మే వినియోగించడంతో సింగరేణి అవార్డును దక్కిం చుకున్నది. సింగరేణిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రా నికి ఎనెర్జీ ఎఫిషియెన్సీ అవార్డు రావడంపై సింగరేణి సీఎండీ ఎన్‌ . శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్లాంట్‌ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ ప్లాంట్‌ మంచి పీఎల్‌ఎఫ్‌ సాధిస్తూ దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని ఆయన తెలిపారు. ప్రతి నెలా ప్లాంట్‌ నిర్వహణపై సమీక్షలు నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దడం వల్లే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement