Saturday, November 23, 2024

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్?

కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్థలను బంద్ చేసిన ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించే ఆలోచనల్లో ఉందని సమాచారం. ప్ర‌జ‌లు స‌హ‌క‌రించ‌క‌పోతే తెలంగాణ మ‌రో మ‌హారాష్ట్ర అవుతుంద‌ని హెల్త్ డైరెక్టర్ హెచ్చరించడంతో పాటు జిల్లాల్లో ప‌రిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం, టెన్త్, ఇంటర్ అధికారులతో మంత్రి సబిత భేటీ కావడం వంటి అంశాలను చూస్తుంటే గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయడమే తరువాయి అనిపిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీ తరహాలో తెలంగాణలోనూ వీకెండ్ లాక్‌డౌన్, రాత్రి 10 గంటల నుంచి ఉ.6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తే కరోనాను కంట్రోల్ చేయవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌చ్చే వారికి క‌రోనా నెగెటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రి చేయ‌టం, బార్లు మూసివేసి షాపింగ్ మాల్స్, థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల‌పై ఆంక్ష‌లు విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు సీబీఎస్ఈ ఇప్ప‌టికే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌టం, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఈయ‌ర్ విద్యార్థుల‌ను ప్ర‌మోట్ చేసి సెకండ్ ఈయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌టం వంటి అంశాల‌పై తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement