హైదరాబాద్ టూవీలర్ ప్రయాణికులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై టూవీలర్‌పై వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. రోడ్డుప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో టూవీలర్ ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారని, అందులోనూ హెల్మెట్ ధరించనివారే అధికంగా ఉన్నారని వారు తెలిపారు. గత ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 625 రోడ్డుప్రమాదాలు జరగ్గా 663 మంది చనిపోయారని.. అందులో ద్విచక్రవాహనదారుల సంఖ్య 455గా ఉందని పోలీసులు వెల్లడించారు. ఒకవేళ హెల్మెట్ ధరిస్తే ప్రాణనష్టం తక్కువగా ఉండేదన్నారు. అందుకే తాము ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement