ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్నారెడ్డి.. ఓటమి దిశగా పయనించారు. ఈ నేపధ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దని విన్నవించారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్ కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ సర్టిఫికేట్స్ తో ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదన్నారు. తన పలుకుబడి 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్ ను భవిష్యత్ లో ఎవరు తట్టుకోలేకోలేరన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు తట్టుకోగలరన్నారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డిలు శక్తికి మించి తనకు సహకరించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement