Wednesday, November 20, 2024

చిన్నారులకు వ్యసనంగా మారుతున్న ఇంటర్నెట్

ఒంటరితనాన్ని అనుభవిస్తున్న చిన్నారులకు ఇంటర్నెట్ వ్యసనంగా మారుతోందని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ముఖ్యంగా 16 ఏళ్ల వయసున్న చిన్నారులు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారి అతి వాడుతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన చిన్నారులకు అతి ఉత్సాహం ఉంటుందని.. బయట తిరగాలి, స్నేహితులతో ఆడుకోవాలి అనే చాలా కోరికలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు.

కానీ కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఇంట్లోనే ఉండిపోవడం, ఐసోలేషన్ కారణంగా వారిలో ఒంటరితనం పెరిగిందని, దీంతో ఇంటర్నెట్‌ను అతిగా వాడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో స్నేహితులతో చిట్ చాట్ చేయడంతో ఇంటర్నెట్‌కు వారు బానిసలుగా మారారని పేర్కొన్నారు. కానీ ఇలాంటి చిన్నారులు ఇంటర్నెట్‌ను అతిగా వాడటం వల్ల ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement