మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో పర్యటించారు. ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరని.. ఇక్కడి ప్రజలకు రోషం, పౌరుషం లేదా అని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినా ప్రజలకు కోపం ఎందుకు రావడం లేదని నిలదీశారు. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు బతికి ఉన్నా చచ్చినట్లే లెక్క అన్నారు. ప్రజల అసమర్ధత వల్లే జగన్ మళ్లీ ఓటు అడుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నేను ఇక్కడకు వచ్చింది ప్రజల ఓటు కోసం కాదని, వారి భవిష్యత్ కోసం అని పేర్కొన్నారు. పేకాట మంత్రి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement