తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు విదేశీయులకు ప్రవేశ నిషేధాన్ని పొడిగించాలని అధికారులకు సూచించింది. మార్చి 7 ఆదివారం నుంచి నెలరోజుల పాటు సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించబడుతుందని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో వైద్య సామాగ్రి, ఫార్మసీలు, సూపర్ మార్కెట్ల డెలివరీ సేవలను అనుమతిస్తామని పేర్కొంది. ఏసీ, ఎలివేటర్ నిర్వహణ సేవలకూ మినహాయింపు ఉంటుందని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో మసీదులకు కాలినడకన వెళ్తేనే అనుమతిస్తామంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్‌లలో ప్రవేశానికి అనుమతి ఉంటుందని.. క్యాబ్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించింది. పబ్లిక్ పార్కులు, రిసార్టులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అన్ని సీటింగ్ ప్రదేశాలు మూసివేయబడతాయని ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement