ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,252 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా మహమ్మారికి మరో 15 మంది బలైనట్లు వెల్లడించింది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 2,440 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకూ 13,256 మంది చనిపోయినట్లు వివరించింది. మొత్తం కరోనా కేసులు 19,54,765గా ఉన్నాయి. మొత్తం 19,19,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,155 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు:
శ్రీకాకుళం 64, విజయనగరం 27, విశాఖ 125, తూ.గో. 385, ప.గో. 222, కృష్ణా 240, గుంటూరు 171, ప్రకాశం 241, నెల్లూరు 269, చిత్తూరు 316, అనంతపురం 41, కర్నూలు 53, కడప 98
ఈ వార్త కూడా చదవండి: 18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు, యువతి మృతి