ఎయిర్ ఫోర్స్ కి అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్ గా భారత సంతతికి చెందిన రవి చౌదరిని నియమించాలన్న ప్రతిపాదనకి అమెరికా పెద్దల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రవి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు సెనెట్ 65-29 ఓట్ల తేడాతో మద్దతు పలికింది. రవికి అనుకూలంగా ఓటేసిన వారిలో డజను మందికి పైగా ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు ఉండటం గమనార్హం. రవి చౌదరి 1993-2015 మధ్య అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో సీ-17 విమాన పైలట్‌గా వివిధ రకాల మిషన్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో వున్న జీపీఎస్ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత అమెరికా రవాణా శాఖలో సీనియర్ అధికారిగా పనిచేశారు. అమెరికా విమానయాన శాఖ ఫెడరల్ ఏవియేషన్‌లోనూ సేవలందించారు. ఆ శాఖకు సంబంధించి అధునాతన పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement