ఉద్యోగ అర్హత నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకి రెండో స్థానం
దక్కింది. మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కలిసి నిర్వహించిన సర్వే ను ఇండియా స్కిల్ రిపోర్టు 2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో మహిళలే ముందంజలో ఉన్నారు. అంతే కాదు ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.
ఇక పట్టణాల పరంగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. వివిధ రంగాల్లో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అని ఈ సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు ఓవైపు మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే పురుషుల ఉద్యోగుల శాతం మాత్రం తగ్గుతూ వస్తోందని ఇండియా స్కిల్ రిపోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.