హైదరాబాద్ ఆంధ్రప్రభ : రేపటి నుంచి(బుధవారం) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1882 కళాశాలల్లో జరగనున్నా ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.52 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఎంపీసీ గ్రూపు విద్యార్థులు దాదాపు 1.56 లక్షల మంది కాగా, బైపీసీ గ్రూపు విద్యార్థులు 1.01 లక్షల మంది ఉన్నారు. మిగిలినవారు ఒకేషనల్ విద్యార్థులున్నారు.
డిపార్ట్‌మెంట్ అధికారుల కొనసాగింపు..
ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌కు ఈ సారి డిపార్ట్‌మెంట్ అధికారులు లేకుండానే జరపాలని ముందస్తుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీంతో వారిని కొనసాగించాలని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో దిగొచ్చిన బోర్డు.. పరీక్షల నిర్వహణ కోసం డిపార్ట్‌మెంట్ అధికారులను కొనసాగిస్తామని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..