రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఫిబ్రవరి 25న పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మన్‌సుక్ హిరెన్ మరణించాడు. ముంబైకి సమీపంలోని ఓ వాగులో అతడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న థానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మన్‌సుక్ హిరెన్ ఓ వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజాగా సదరు వాహనం యజమాని మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement