Thursday, December 26, 2024

చెట్టుకు అంతిమయాత్ర

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చెట్టుకు అంతిమయాత్ర నిర్వహించి సేవ్ ద ట్రీస్ సంస్థ వారు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సంస్థ మొక్కలు నాటి గ్రినరీ కోసం ప్రయత్నం చేస్తోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం చెట్లు అయ్యాయి. అయితే గుర్తుతెలియని వ్యక్తులు కొందరు స్థానిక హై స్కూల్ గ్రౌండ్‌లో పెరుగుతున్న చెట్లను నరికి పడేశారు.

దానిని చూసిన సంస్థ ప్రతినిధులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం ఆ చెట్టుకు అంతిమ యాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి నినాదాలు చేశారు. అక్కడి నుండి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి ఆందోళన చేశారు. చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement