మున్సిపాలిటీలో టాప్

  • కేక్ కట్ చేసిన జేసీ
  • కౌన్సిలర్లు సంబరాలు


(అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీ (Tadipatri Municipality) నంబర్ వన్ గా నిలిచింది. దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సంబరాలు జరుపుకున్నారు. తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

దసరా నవరాత్రుల్లో (Dasara Navaratri) భాగంగా దసరా వేడుకలను ముందుగానే కార్యాలయంలో అమ్మవారి చిత్ర పటాలను ఉంచి ప్రత్యేక పూజలు చేసి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో తాడిపత్రి మొదటి స్థానం ర్యాంకింగ్ దక్కడం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తో కలిసిభారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply