vizag |నేడు విశాఖలో నాలుగో టీ20

- హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్
- నాలుగో టీ20 అయినా గెలవాలని చూస్తోన్న న్యూజిలాండ్
- రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం
vizag | స్వదేశం వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ దుమ్మురేపుతున్నది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. టీమ్ఇండియా దృష్టి మొత్తం క్లీన్‌స్వీప్ పైనే ఉంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. నాలుగో టీ20 మ్యాచ్‌కు సాగరతీర నగరం విశాఖపట్నం వేదిక కానుంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పరుగుల వరద పారుతున్న సిరీస్‌లో భారత్‌కు కివీస్ దీటైన పోటీనివ్వలేకపోతున్నది. టీమ్ఇండియా టాపార్డర్ సూపర్ ఫామ్ మీద ఉంది. భారత బ్యాటర్లు అందరూ చెలరేగుతున్నారు. కానీ ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం పరుగులు చేయలేక సతమతమవుతున్నాడు. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది. – వెబ్‌డెస్క్(స్పోర్ట్స్), ఆంధ్రప్రభ

యువ బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ ఫామ్‌లోకి రావడం జట్టు విజయ అవకాశాలను మెరుగుపర్చుకుంది. వీరికి తోడు ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దుమ్మురేపుతున్నాడు. ఒక్క సంజూ శాంసన్ ఫామ్‌పై మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తుంది. బౌలింగ్‌లో బుమ్రా రిథమ్‌లోకి రాగా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌సింగ్ నిలకడకనబరుస్తున్నారు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్యాదవ్..వైజాగ్ టీ20 పోరులో కీలకం కానున్నారు. మరోవైపు మిగిలిన రెండింటిలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ చూస్తున్నది.

విశాఖలో బ్యాటింగ్ పిచ్
బ్యాటింగ్‌కు స్వర్గధామం అయిన ఈ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. రాత్రి వేళ ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉండడంతో ఎంతటి లక్ష్యం అయినా కూడా సురక్షితం కాదు. దీంతో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు కాస్త సహకారం అందుతూ ఉంటుంది.

మూడు మ్యాచుల్లో సంజూ విఫలం
ఓపెనర్ సంజూ శాంసన్ మినహా మిగిలిన భారత బ్యాటర్లు అందరూ ఈ సిరీస్‌లో పరుగులు వరద పారిస్తున్నారు. ఈ సిరీస్‌లో సంజూ వరుసగా 10, 6, 0 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం రెండు ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. మరోవైపు రీ ఎంట్రీలో ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్న నేపథ్యంలో సంజూ ఇలాగే విఫలం అయితే టీ20 ప్రపంచకప్‌లో అతడి స్థానం గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో సంజూ శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎలాగైనా గెలవాలని..
మూడు మ్యాచ్‌లలో తేలిపోయిన కివీస్ నాలుగో టీ20 అయినా గెలవాలని చూస్తోంది. కాన్వే, సీఫర్ట్, రచిన్ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఫిలిప్స్, మిచెల్, చాప్మన్, శాంట్నర్‌లతో మిడిలార్డర్ బాగానే ఉంది. పేసర్ హెన్రీ రాణిస్తున్నాడు. స్పిన్నర్లు శాంట్నర్, ఇష్ సోధి ప్రభావం చూపట్లేదు. స్పిన్‌కు అనుకూలించే విశాఖ పిచ్‌పై వేరు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. 200లకు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. విశాఖలో భారత్ నాలుగు టీ20లు ఆడితే.. మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడింది.
