Today Horoscope 05 November 2026: ఇంద్ర, వైధ్రుతి యోగాల వేళ ఈ రాశుల వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!
Today Horoscope 05 November 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నేడు (నవంబర్ 05, 2026) గురువారం చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరఫాల్గుణి నక్షత్రం ప్రభావంతో పాటు అత్యంత శుభప్రదమైన ఇంద్ర, వైధ్రుతి యోగాలు ఏర్పడుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున, గురు గ్రహ బలం కారణంగా మేషం నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం..
మేష రాశి ఫలితాలు (Aries)
ఈరోజు శుభ యోగాల ప్రభావంతో మేష రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, కెరీర్‌లో పురోగతి సాధించడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులు ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
పరిహారం: ఈరోజు శ్రీ విష్ణు చాలీసా పఠించాలి.
వృషభ రాశి ఫలితాలు (Taurus)
వృషభ రాశి వారికి నేడు సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది. చేపట్టిన పనుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం. విద్యార్థులు మరింత కష్టపడితేనే మంచి ఫలితాలు సాధించగలరు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామం పఠించాలి.
మిథున రాశి ఫలితాలు (Gemini)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. శుభ యోగాల వల్ల కోరికలు నెరవేరుతాయి. అయితే అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
పరిహారం: ఈరోజు శ్రీ హరికి ప్రత్యేక పూజలు చేయాలి.
కర్కాటక రాశి ఫలితాలు (Cancer)
గురు గ్రహ అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంది.
పరిహారం: ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
సింహ రాశి ఫలితాలు (Leo)
సింహ రాశి వారికి ఈరోజు ఎంతో శుభప్రదంగా ఉంది. పనులన్నీ సకాలంలో పూర్తయి ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం తొందరపాటు వద్దు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
పరిహారం: ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
కన్య రాశి ఫలితాలు (Virgo)
కన్య రాశి వారికి అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం, మంచి లాభాలు కలుగుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తుల సహాయం లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు.
పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.
తులా రాశి ఫలితాలు (Libra)
తులా రాశి వారికి ఈరోజు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది.
పరిహారం: ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio)
వృశ్చిక రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. కోల్పోయిన ధనం తిరిగి పొందే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశాంతి లభిస్తుంది. విద్యార్థులకు చదువులో అనుకూల వాతావరణం ఉంటుంది.
పరిహారం: ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో దానధర్మాలు చేయాలి.
ధనస్సు రాశి ఫలితాలు (Sagittarius)
శుభ యోగాల ప్రభావంతో ధనస్సు రాశి వారు రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు ప్రాజెక్టుల్లో తమ ప్రతిభను చాటుకుంటారు. బంధుమిత్రుల సహకారంతో పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
పరిహారం: ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో దానధర్మాలు చేయాలి.
మకర రాశి ఫలితాలు (Capricorn)
మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. ఉద్యోగ రంగంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పని నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం.
పరిహారం: ఈరోజు విష్ణు మంత్రాలను పఠించాలి.
కుంభ రాశి ఫలితాలు (Aquarius)
కుంభ రాశి వారికి ఈరోజు అదృష్టం తోడుంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
పరిహారం: ఈరోజు శని చాలీసా పఠించాలి.
మీన రాశి ఫలితాలు (Pisces)
మీన రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలు మీ భుజాన పడతాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు.
పరిహారం: ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్య నిపుణులు, విశ్వాసాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
