Today Horoscope 01 November 2026: సిద్ధి యోగం ప్రభావంతో మేషం సహా ఈ రాశుల దశ తిరగనుంది!

Today Horoscope 01 November 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026 నవంబర్ 01 (ఆదివారం) రోజు గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తుండగా, మాఘ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీనికి తోడు సిద్ధి, సాధ్య యోగాలు తోడవడంతో పాటు ఆదివారం రోజు సూర్యభగవానుడికి అంకితం కావడం విశేషం. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం సహా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుండగా, మరికొన్ని రాశుల వారు కొన్ని విషయాల్లో హెచ్చరికగా ఉండాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అందించిన వివరాల ప్రకారం 12 రాశుల వారి ఈనాటి ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మెప్పు లభించినప్పటికీ, తోటి ఉద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆత్మీయుల అనారోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. బయటి ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరం.

పరిహారం: వినాయకుడిని ప్రత్యేకంగా పూజించాలి.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. సమాజంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి.

పరిహారం: రాగి పాత్రలో నీటిని తీసుకోని సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి.

మిథున రాశి

ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభించి పనులు సజావుగా సాగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉన్నప్పటికీ, అనవసరమైన వ్యయాలను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రం వేళల్లో వాహన చోదనలో అప్రమత్తత అవసరం. బంధుమిత్రుల కలయిక మనోధైర్యాన్ని ఇస్తుంది.

పరిహారం: సూర్య దేవాలయాన్ని సందర్శించి పూజలు చేయాలి.

కర్కాటక రాశి

గురు గ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. తొందరపాటుతో, భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. సాయంత్రం సమయంలో దైవదర్శనం చేసుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది.

పరిహారం: సూర్య భగవానుడికి జలాభిషేకం/అర్ఘ్యం సమర్పించాలి.

సింహ రాశి

సిద్ధి యోగం కారణంగా రాజకీయం, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు కలసివచ్చే సమయం. ఆరోగ్య పరంగా ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పరిహారం: సూర్యునికి నీటితో అర్ఘ్యం ఇవ్వడం మంచిది.

కన్య రాశి

కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూలత ఉంటుంది. సాయంత్రం వేళ ధనలాభ సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

పరిహారం: విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

తులా రాశి

నూతన రాబడి మార్గాలు సుగమమవుతాయి. మీ మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. వైవాహిక జీవితంలో భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అయితే అధిక పనిభారం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవాలి.

పరిహారం: సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి.

వృశ్చిక రాశి

శుభ యోగాల ప్రభావంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటల విషయంలో కఠినత్వం లేకుండా చూసుకోవాలి, లేదంటే అనవసర వివాదాలు రావచ్చు.

పరిహారం: సూర్య మంత్రాలను జపించడం శ్రేయస్కరం.

ధనస్సు రాశి

ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధనలాభం ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రావలసిన బాకీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కోర్టు లేదా న్యాయపరమైన వివాదాల్లో విజయం మీదే అవుతుంది. ప్రత్యర్థుల కుట్రలు ఫలించవు.

పరిహారం: సూర్య భగవానుడికి ప్రత్యేక ఆరాధన చేయాలి.

మకర రాశి

వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. వృత్తి లేదా ఉద్యోగ మార్పునకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో అభ్యర్థులు విజయం సాధిస్తారు. అయితే వాహనాల నిర్వహణ, ప్రయాణాల విషయంలో అదనపు ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి.

పరిహారం: శని మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి

రెండో స్థానంలో శని సంచారం వల్ల పనుల్లో కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త పడాలి. కోర్టు వ్యవహారాలు, దంపతుల మధ్య సంబంధాలు సానుకూలంగా ఉంటాయి.

పరిహారం: సూర్య మంత్రాలను పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి.

మీన రాశి

సిద్ధ యోగం వల్ల దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు అందుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, సలహాలు ప్రతి పనిలోనూ కలసివస్తాయి. ఆరోగ్య రీత్యా మెరుగైన మార్పులు కనిపిస్తాయి. ప్రయాణాల సమయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి.