మార్లవాయి మాజీ సర్పంచ్ కు…

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో జరిగిన ‘అమ్మ ఓడి.. నా తెలంగాణా’ పుస్తకావిష్కరణ వేడుకలో, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామ మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావుకు ప్రతిష్టాత్మకమైన ‘ఆశా గీతాంజలి 2025’ అవార్డు లభించింది. ఈ గౌరవాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అందజేశారు.

ఈ అవార్డు సామాజిక సేవకు గుర్తింపుగా లభించ‌గా.. కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ, ఈ అవార్డు అందుకోవడంపై స్పందిస్తూ, ఇది తన సామాజిక సేవలకు గుర్తింపు అని అన్నారు.

ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ఈ అవార్డును తన పంచాయతీకి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కొమురం భీం జన్మస్థలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, లోక్‌సభ సభ్యుడు ఈటెల రాజేందర్, మెడ్చల్ ఎమ్మెల్యే రాయపూడి ఆశాలత, సింగరేణి ఛైర్మన్ బలిరాం నాయక్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పైడి రాకేష్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ అవార్డు సామాజిక సేవకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని, మరింత మందిని ప్రోత్సహిస్తుందని కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

Leave a Reply