తిరువూరు మున్సిపాలిటీ రిజర్వేషన్లపై ఎమ్మెల్యే కొలికపూడి హర్షం

బీసీలకు టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుంది

ఎ.కొండూరు (తిరువూరు), ఆంధ్రప్రభ : తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్‌ వార్డు రిజర్వేషన్లలో భాగంగా బీసీ జనరల్‌కు కేటాయించడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు.

బీసీల అండదండలతో మున్సిపాలిటీలో మరోసారి తెలుగుదేశం పార్టీ జెండాను ఘనంగా ఎగురవేస్తామని ఆయన అన్నారు. టీడీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.