మ‌తిస్థిమితం లేని వ్య‌క్తికి స‌కాలంలో వైద్య సేవ‌లు

మ‌తిస్థిమితం లేని వ్య‌క్తికి స‌కాలంలో వైద్య సేవ‌లు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మాన‌వత్వం ప‌రిమ‌ళించింది. ఓ మతిస్థిమితంలేని వ్యక్తికి గాయ‌మైతే స‌కాలంలో వైద్యసేవ‌లు(Medical services) అందించేలా సేవ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన యువ‌త‌ను ప‌లువురు అభినందించారు. మంచిర్యాల జిల్లా(Mancheryala Distt) చెన్నూరు బాలికల పాఠశాల ముందు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేతికి తీవ్రగాయమై తీవ్ర ఇబ్బందులకు గురై కొట్టుమిట్టాడున్నాడు.

ఇంది గమనించిన యుకులు స్పందించి స్థానిక పోలీసుల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స(First Aid) అందిలా స‌హ‌క‌రించారు. అలాగే ఆ వ్య‌క్తికి ఆహారం బట్టలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఎడమ చెయ్యి పూర్తిస్థాయిలో దెబ్బతిని పోయిందని వైద్యులు తెలుపగా ఎవ్వరైనా దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయాన్ని అందజేస్తే ఉన్నత వైద్యసేవలు అందేలా చూ స్తామన్నారు.

Leave a Reply