Tibetan Buddhism | దలైలామా రికార్డ్..

Tibetan Buddhism | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; 90 ఏళ్ల వయసులో టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా రికార్డ్ సొంతం చేసుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో ఆయనకు గ్రామీ అవార్డు వరించింది. మెడిటేషన్‌ అనే ఆల్బమ్‌కు గాను దలైలామాకు ఈ అవార్డు వచ్చింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు.

ధ్యానం, శాంతి, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై ఆయన స్వయంగా చెప్పిన భావాలను ఈ స్పోకెన్-వర్డ్ ఆల్బమ్‌తో ప్రజల ముందుకు తెచ్చారు. ద‌లైలామా చేసిన ఈ ప్రసంగాల‌కు స‌రోద్ వాయిద్యకారుడు అంజ‌ద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.ఈ అవార్డులను ది రికార్డింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా నిర్వహించారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డును అందుకుని దలైలామా చరిత్ర నెలకొల్పారు.

Leave a Reply