ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌(ORR)పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతున్న పారిశుధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే దుర్మరణం(Three Sanitation Workers Dead) చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతులది ఒడిశాగా గుర్తించారు. డెడ్‌బాడీ(Deadbody)లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply