మ‌రో ముగ్గురికి గాయాలు

మ‌రో ముగ్గురికి గాయాలు

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద జాతీయ రహదారిపై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యువతీ యువకుడు బైక్ పై వస్తూ బీబీనగర్ పట్టణంలో రోడ్డు పక్కన నిలుచున్నారు. అదే సమయంలో ఘట్కేసర్ నుంచి భువనగిరి వైపు వెళుతున్న వాహ‌నం ఢీకొంది. అనంత‌రం చెట్టుకు ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో రోడ్డు ప‌క్క‌నే ఉన్న గ‌ర్ధాసు ప్రశాంత్ (32), గర్ధాసు ప్రసన్న (28) అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

జీపులో ఉన్న మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్రమాదంలో ప్ర‌శాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్ర‌స‌న్న‌ అక్కడి నుంచి ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. వాహ‌నంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యువతి మృతదేహం చెరువులో పడడంతో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలించి వెలికితీశాయి. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన సొంత ఊరు రాజాపేట మండలం.

ఆయ‌న భార్య ప్ర‌స‌న్న క‌న్న‌వారిది వరంగల్ లోని పాలకుర్తి మండలం. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో వీరిద్ద‌రూ నివాసం ఉంటున్నారు. వీరిద్ద‌రు వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Leave a Reply