ప్రకాశం : రోడ్డు ప్రమాదం ( RoadAccident) లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉలవపాడు మండలం చాకిచెర్ల దగ్గర వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు (Three died).. మరో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు (Doctors) తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు (Nellore) కు తరలించారు. వీరంతా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల (piduguralla) నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాదం వెంటాడింది.. పోలీసులు (police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.