Breaking News |ముగ్గురు మృతి… 20మందికి గాయాలు
Breaking News | ముగ్గురు మృతి… 20మందికి గాయాలు
అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం…
Breaking News | వికారాబాద్, అక్టోబర్ 3 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి నుంచి తాండూరు వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి బస్సు అదుపుతప్పడమే కారణమా? లేక రహదారి పరిస్థితుల వల్ల ప్రమాదం జరిగిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులు వెల్లడించాల్సి ఉంది.
