అయినా, సక్రమంగా నేరవేర్చవలసిన వారి ఉద్యోగ బాధ్యతలకు (Job Responsibilities), విధి నిర్వహణ (Duty management) కు రేట్లు పెట్టుకుంటున్నారు కొందరు. కక్కుర్తితో, కాసుల దాహంతో సామాన్యుల నుంచి వారివద్దకొచ్చే ప్రతి ఒక్కరి నుంచి ముక్కుపిండి మరీ లంచాలు వసూలు చేస్తున్నారు. మరో తరానికి సరిపడా సంపాదించుకున్నా వీరి ధనదాహం తీరడం లేదు.

అవినీతి (Corruption) కి అంతే లేదు. ఇంట్లో సొమ్ము దాచుకోవడం స్థాయి దాటిపోయి, దాచుకోవడానికే భవంతులు, ఫార్మ్ హౌజ్ లు కొనుక్కుంటున్నారంటే అవినీతి విశృంఖలత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు…గుట్టలు గుట్టలు… నోట్ల కట్టలు నిరుపయోగంగా వారి బంగళాల్లో మూలుగుతున్నా, మరింత కూడబెట్టడం కోసమే ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. అనిశా అధికారులకు పట్టుబడినా, ఒక్కసారి సస్పెండయినా (suspend) వీరి తీరులో మార్పే కానరావడం లేదు. పిసరంతైనా పశాత్తాపం అసలే లేదు. దాడులకు పాల్పడిన అధికారులకే వీరి ఇళ్ళల్లోని డబ్బూ (money), నగలూ (jewelry), వస్తువులూ , ఆస్థిపత్రాలూ చూసి కళ్ళు తిరుగుతున్నాయంటే వీరి అవినీతికి అంతే లేదాని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.


ఒకపక్క రాజకీయ నేతలేమో (Political leaders) వందలు, వేలకోట్ల స్కాముల్లో మునిగిపోతుంటే, మరోపక్క ప్రభుత్వోద్యోగులేమో ఇలా లంచాలకు మరిగి ప్రజలను పీల్చి దండుకుంటున్నారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వచ్చిన సొమ్మునే వీరికి జీతభత్యాల (Salary and allowances) రూపంలో అందినా, తిరిగి తమ సేవలకు మళ్ళీ ఇలా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. రాబోయే తరాల్లో అయినా ఇలాంటి లంచావతారాలు లేకుండా చూడాలంటే, అవినీతి, లంచగొండితనం జాతికి ఎంత ప్రమాదమో పాఠ్యాంశాల్లో చేర్చి, చిన్నప్పట్నుంచే నీతి-నిజాయితీల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply