అష్ట దిగ్బంధనంలో తొర్రూరు..

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ తోపాటు భూపాలపల్లి, సూర్యాపేట ఎస్పీలు,5 గురు డిఎస్పీలు, పలువురు సిఐ,ఎస్సై లతో పాటు సుమారు 1000 మంది పోలీసులను భద్రతకై నియమించారు.తొర్రూరు పట్టణంలోని నలుమూలల పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గుమ్మి కూడకుండా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించి ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. శాంతియుతంగా ఎన్నుకునే విధంగా పట్టణంలో భారీ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
