గుడుంబా కేసులో ఇద్దరికి బైండోవర్
10 లీటర్ల గుడుంబా తరలిస్తున్న ఇద్దరి పట్టివేత
తొర్రూరు, ఆంధ్రప్రభ : గుడుంబా సరఫరా చేస్తున్న కేసులో ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ బి. అశోక్ తెలిపారు. శనివారం డివిజన్ కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ శివారులో ఓ ఆటోలో 10 లీటర్ల గుడుంబాను తరలిస్తున్న తొర్రూరు దుబ్బతండాకు చెందిన తేజావత్ చంద్రకళ, ఆర్. ఏకాంబరంను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తొర్రూరు తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ గుడుంబా తయారీకి సంబంధించిన పదార్థాలను తరలించినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై శంకర్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
