ఒడిషా బస్సు.. తిరుగుతుంటే.. తనిఖీలేవీ?
1.దేశం మొత్తం ప్రయాణికులతో తిరిగే అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఆయా బస్సులు కచ్చితంగా రాష్ట్ర సరిహద్దులు దాటే ముందు ఆ రాష్ట్రాలకు డీటీసీ ఆర్టీవో వంటి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
2.రాష్ట్ర సరిహద్దులు దాటే ముందు కేవలం కాగితాలలో ఉన్న అనుమతులు వరకే రోడ్డు రవాణా అధికారులు తనిఖీ చేస్తారే తప్ప బస్ ఫిట్నెస్ ఫిజికల్ గా తనిఖీ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు.
3.ఎక్కడో ఒడిశా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన బస్సు దేశం మొత్తం తిరిగే అనుమతులు ఉన్నప్పటికీ కూడా కేవలం కర్ణాటకలో బయలుదేరి ఆంధ్ర మీదుగా తెలంగాణ వరకే తిరగడానికి గల కారణాలు అందుకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు అనుమతులు పూర్తిగా ఉన్నాయా,? లేదా.?
4.ప్రతి బస్సుకు కూడా ఒక నిర్ర్థిష్టమైన కొలతల ప్రకారం మాత్రమే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించడానికి, పడుకొని ప్రయాణించడానికి అనుమతి ఇవ్వాలి. కర్నూలు జిల్లాలో దుర్ఘటనలో ఎక్కడో ఒడిశా రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బస్సు కర్ణాటక ఆంధ్ర తెలంగాణల మధ్య ఎందుకు తిరుగుతుంది? ఇదే నెంబర్ పై వేర్వేరు చోట్ల వేరువేరు ప్రాంతాల నుండి మరికొన్ని బస్సులు తిరుగుతున్నాయా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రోడ్డు రవాణా సంస్థ అధికారులు నిర్లక్ష్యానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యంగా ఈ దుర్ఘటన నిలుస్తోంది. గతంలో అనంతపురం నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు జరిగిన ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ దందా మళ్లీ తెరపైకి వచ్చిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

